హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): దళితులు, బీసీల భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులపై చర్యలు చేపట్టాలని దళిత మహిళా మండలి అధ్యక్షురాలు ఎం పద్మ, ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి, కార్యదర్శి టీ జయమ్మ సలహాదారులు టీ రమణయ్య, ఎం రమాదేవి సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కూకట్పల్లి మండలం సర్వే నంబర్ 57లోని నాలుగు ఎకరాల్లో 200 మంది పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను ఈటల బంధువులైన రాములు, లక్ష్మయ్య, పురుషోత్తం, సహదేవ్, వేమారెడ్డి, జగదీశ్, రామకృష్ణ తదితరులు ఆక్రమించి లబ్ధిదారులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు స్పందించాలని, లేకపోతే బీసీ, దళిత, గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని
హెచ్చరించారు.