హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : గురుకుల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించార. ఈ సందర్భంగా పది, ఇంటర్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను అభినందించారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): 2022-23 బ్యాచ్‌కు చెందిన ఎంబీబీఎస్ పార్ట్-2 పరీక్షలను రెండు దశల్లో నిర్వహించాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్చార్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం జాతీయ వైద్య కమిషన్ కు వినతిపత్రం అందజేసినట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ ఒక ప్రకటనలో తెలిపారు.