Ponnam Prabhakar | ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. త్వరలో నోటిఫికేషన్: మంత్రి పొన్నం ప్రభాకర్
త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన, ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నదని చెప్పారు. దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు రూ.5500 కోట్లు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులను కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని పేర్కొన్నారు.
మొత్తం ఉద్యోగాలు- 3038
ఇందులో..
- డ్రైవర్-2000
- శ్రామిక్-743
- డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్)- 84
- డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్)- 114
- డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్- 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్- 18
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 23
- సెక్షన్ ఆఫీసర్ ( సివిల్)-11
- అకౌంట్ ఆఫీసర్స్- 6
- మెడికల్ ఆఫీసర్స్ జనరల్- 7
- మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్- 7
ఈ పోస్టులను త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వం లో నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

