హైదరాబాద్, 7జూలై (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్‌ను మరింత బలోపేతం చేసేలా సూచనలు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అంతకుముందు గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. గురుకులాలు, హాస్టళ్లు శుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు.