హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఆర్టీసీ డిపోల ఏ ర్పాటు, నిర్మాణం వంటి ప్రస్తావనేదీ తమ వద్ద లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్గౌడ్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు ఉ న్నతాధికారులతో ముఖాముఖి నిర్వహించా రు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తికి చుట్టూ 50 కి లోమీటర్ల దూరంలో ఒక్క ఆర్టీసీ బస్సు డిపో లేదని, తమకు డిపో మంజూరు చేయాలని కో రగా మంత్రి తిరస్కరించారు.
ప్రస్తుతం కొత్త డిపోల ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. సూర్యాపేట, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సులు మోతూరు, తుంగతుర్తిలో ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల సమీక్షలో తొలి రోజు ఉమ్మడి నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్, జయవీర్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్ బస్స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సూచించారు.