హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులకు తేడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రెడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకూ వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో డెస్ జర్నలిస్టులు అపోహలకు గురికావద్దని సూచించారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించి, తుది జీవోను జారీ చేస్తామని వెల్లడించారు.
మంగళవారం సచివాలయంలో డీజేఎఫ్ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల జారీ చేసిన జీవో 252 రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు, డెస్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇస్తామనే ప్రకటన జర్నలిస్టుల్లో విభజన తెచ్చేలా ఉన్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో డెస్ జర్నలిస్టులు కూడా ఫీల్డ్వర్ చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ జీవోతో జర్నలిస్టులకు భారీగా అక్రెడిటేషన్లు తగ్గే అవకాశం ఉన్నదని, మహి ళా కోటాను పునరుద్ధరించాలని కోరారు. స్పందించిన శ్రీనివాస్‌రెడ్డి జీవోపై కొంతమంది అపోహలకు గురిచేలా ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. డెస్ జర్నలిస్టులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.
అర్హులైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూలా జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామని స్పష్టంచేశారు. మంత్రిని కలిసిన వారిలో డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎస్ మస్తాన్, ట్రెజరర్ ఉపాధ్యక్షుడు రాజారామ్, జాయింట్ సెక్రటరీ విజయ, స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, జర్నలిస్టుల ప్రతినిధులు శేఖర్,సురేశ్, వెంకటరమణ, రమేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు, జీవో 252లో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర వరిం గ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. ఈ మేరకు మంగళవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో టీ యూడబ్ల్యూజే ప్రతినిధులు కలూరి రా ములు, కే శ్రీకాంత్‌రెడ్డి, వీ యాదగిరి, ఎం వెంకట్‌రెడ్డి, రాజేశ్, గౌస్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శంకర్గౌడ్తదితరులు ఉన్నారు.