హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.
ఇండ్ల కోసం ఇచ్చిన నిధులను పాతబాకీ కింద జమ చేసే బ్యాంకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండ్ల బిల్లుల కోసం లంచాలు అడిగితే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను (18005995991) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.