హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కూ అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సమాచారశాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు 46 వేల మందికి పైగా అక్రెడిటేషన్లు ఇచ్చేలా మార్పులు చేసిందని తెలిపారు. మే1వ తేదీన అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు.
మే 10వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకొని దరఖాస్తు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్రెడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిలకు ఆరోగ్యం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30తో ముగిసిన జర్నలిస్టుల బస్‌పాస్ గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది.