హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. 2026-27 విద్యాసంవత్సరానికి పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది రెండు విడతల్లో ప్రవేశాలు కల్పించనున్నట్టు శ్రీదేవసేన తెలిపారు. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, వివరాల కోసం https:// tgpolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూ చించారు. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత డిప్లొమా ఫస్టియర్ క్లాసులను జూన్ 9 నుంచే ప్రారంభిస్తారు.
విద్యార్థులకు జూన్ 9, 10 తేదీల్లో ఓరియంటేషన్ నిర్వహిస్తారు. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సీట్లు పొందిన వారు జూన్ 27, 28 తేదీల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ ైస్లెడింగ్కు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 30న సీట్లు కేటాయిస్తారు.
సీట్లు పొందిన వారు జూలై 1లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. జూలై 1న స్పాట్ అడ్మిషన్ల గైడ్లైన్స్ విడుదల చేస్తారు. జూలై 8లోపు స్పాట్ అడ్మిషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. పాలిసెట్ పరీక్షను ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 24లోపు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
