రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్కటింగ్లు చేస్తూ.. గత నోటిఫికేషన్లకే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ.. తమ ఘనతగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కేసీఆర్ హయాంలో నిర్మించిన బడికి రంగులు వేసి.. తామే నిర్మించినట్టు గొప్పలు చెప్పుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్స్కూల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించగా.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం భవనాలకు రంగులు మాత్రమే వేసింది. ఆరుట్ల గ్రామంలో గతంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలతోపాటు ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండేవి. వీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మాడల్స్కూల్గా అభివృద్ధి చేసింది. కేసీఆర్ హయాంలో ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని హంగులతో నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎస్ఆర్ నిధులతో ఈ భవనాలకు రంగులువేసి తామే నిర్మించినట్టు గొప్పలు చెప్పుకొంటున్నది.