తెలంగాణకు తీరని ద్రోహం.. గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ
చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఎవరితో నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? దీనిపై పోరాటాలు అనవసరం. రేవంత్ ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము.
- మూకుమ్మడి రాజకీయంలో మన హక్కులపై కత్తి
- ఢిల్లీలో వ్యూహాలు.. చిట్చాట్లలో వల్లింపులు
- కొట్లాడాల్సిన వేళ దేబరింపులు.. సంధి మాటలు
బాబు మాట.. రేవంత్ నోట
చంద్రబాబు
బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ ఎవరితో నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? దీనిపై పోరాటాలు అనవసరం.
రేవంత్
ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము.
చంద్రబాబు
గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేం వాడుకుంటం. తెలంగాణ మహా అయితే వంద టీఎంసీలు వాడుతది.
రేవంత్
తెలంగాణలో మా ప్రాజెక్టు పూర్తయి, పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు.
చంద్రబాబు
తెలంగాణపై నేనెప్పుడైనా గొడవపడ్డానా? ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందాం.
రేవంత్
తెలుగువారి మధ్య అనవసర సమస్యలు ఉండొద్దు. చంద్రబాబును చర్చలకు పిలుస్తం. కోర్టులకంటే చర్చలే మేలు.తెలంగాణలాగే ఏపీకి కూడా హక్కులుంటాయి.
సీఎం రేవంత్.. పూటకో మాట!.. మొన్న కానే కాదన్నడు!.. 18.6.25- బుధవారం
బనకచర్లకు కేంద్రం అనుమతులు రావడం భ్రమే. చంద్రబాబుకు సూచన చేస్తున్నా. కేంద్రంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే! గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలున్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులివ్వాలి. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక, ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. అందర్నీ కలిసి మా సమస్యను వివరిస్తం. అప్పటికీ న్యాయం జరగకపోతే, కోర్టులను ఆశ్రయిస్తం.
– హైదరాబాద్‌లో అఖిలపక్షంలో సీఎం రేవంత్
నిన్న ఇచ్చంపల్లి అన్నడు!.. 19.6.25- గురువారం
గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఆంధ్రప్రదేశ్ భావిస్తే, పోలవరం- బనకచర్లకు బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి- నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకువెళ్లే విషయంలో చర్చలకు మేం సిద్ధం.
– ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్‌తో సీఎం రేవంత్
నేడు బనకచర్లకు జై అంటున్నడు!.. 20.6.25- శుక్రవారం
ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు. బనకచర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం. 23న క్యాబినెట్లో సమీక్షించి, చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తం. అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదనను ముందు మాకే చెప్పి ఉంటే వివాదమే ఉండేది కాదు. ఇప్పుడైనా కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది.
– ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

