Guvvala Balaraju | అచ్చంపేట టౌన్, జనవరి 15 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బుధవారం సాయంత్రం భ్రమరాంబ ఆలయం వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
గుడిలోపల ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు స్పష్టంచేశారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కలిసి గువ్వలను బయటకు తోసివేశారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వెళ్లిపోయిన తర్వాత గువ్వల బాలరాజు దంపతులు ఆలయంలోకి వెళ్లారు. అనంతరం పోలీసుల వైఖరిని నిరసిస్తూ గువ్వల నిరసన తెలిపారు. ఆలయంలోకి వెళ్లకుండా తనపై దాడిచేసిన అచ్చంపేట సీఐ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.