పోలీసుల సేవలు ప్రశంసనీయం : మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ | ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు

మహబూబాబాద్ : ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్ పట్టణంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరును, పోలీసుల విధి నిర్వహణ విధానాన్ని ఆమె పరిశీలించారు. లాక్ డౌన్‌ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ సమయంలో గత ఏడాది నుంచి పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కట్టడి చేస్తూనే, కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారన్నారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏడాది లాక్ డౌన్ కు నాలుగు గంటలు మినహాయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు, కోవిడ్ నిబంధనల మేరకు నిత్యావసరాలు తీసుకునేటట్లు పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
గ్రామాల్లో కోవిడ్ కట్టడి, గుర్తింపు, చికిత్స కోసం వేసిన గ్రామ కమిటీల్లో కూడా పోలీసులు నిత్యం వారితో ఉంటూ లాక్ డౌన్ అమలు అయ్యేటట్లు, కోవిడ్ బారిన ప్రజలు పడకుండా ఉండేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో దాదాపు 4000 మంది కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఇంటి దగ్గరే మందులు ఇస్తూ, ధైర్యాన్ని చెబుతూ వారికి అండగా గ్రామ కమిటీలు పనిచేస్తున్నాయన్నారు.
అనవసరంగా బయటకు రాకుండా లాక్ డౌన్ పాటిస్తూ కోవిడ్ కట్టడికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. నిత్యావసరాలకు కూడా కుటుంబంలో ఎవరో ఒకరే బయటకు రావాలని, కుటుంబాన్ని కరోనా నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

