కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
గ్రామీణ నిరుద్యోగం| కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది.

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నవారి సంఖ్య అధికమవుతున్నది. లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ సంఖ్యలో ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు. లాక్డౌన్కుతోడు వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో చేసేందుకు పనులులేక ఖాళీగా ఉంటున్నవారు క్రమంగా పెరిగిపోతున్నారు.

దీంతో గ్రామీణ భారతంలో మే 16తో ముగిసిన వారంలో నిరుద్యోగల సంఖ్య రెండితలయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే 9తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగుల సంఖ్య 7.29గా ఉండగా.. ఈ 16 నాటికి అది 14.34 శాతానికి పెరిగిందని సీఎంఐఈ పేర్కొంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత ఇంత భారీగా పెరగడం గత 50 వారాల్లో ఇదే మొదటి సారని తెలిపింది. గతంలో 2020, జూన్ 7న నిరుద్యోగుల సంఖ్య అత్యధికానికి చేరింది.

కాగా, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన వారు కూడా పెరిగిపోయారని నివేదిక వెల్లడించింది. అర్బన్ ఏరియాలో గత వారం 14.7 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇది మే 9తో ముగిసిన వారంలో దీనికి 3 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. అదేవిధంగా గతవారంలో సరాసరి నిరుద్యోగిత 8.76 శాతం నుంచి 14.45 శాతానికి చేరిందని పేర్కొంది. లాక్డౌన్లతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని అభిప్రాయపడింది. దీంతో ఏప్రిల్‌లో శ్రామిక శక్తి 11 లక్షలు తగ్గిపోగా, మొత్తం ఉద్యోగ శ్రమశక్తి 70.35 లక్షలకు పడిపోయిందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి!
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది మృత్యువాత
‘భారత్‌లో సింగపూర్ వేరియంట్ ఉందన్న వార్తల్లో నిజం లేదు’
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
భారతదేశ ప్రయాణికులపై సూడాన్ ఆంక్షలు
నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా తీవ్రత
కరోనాతో మరణించిన యూపీ మంత్రి
సువేందును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cmie
- Joblessness
- Lockdown
- pandemic
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

