‘భారత్‌లో సింగపూర్ వేరియంట్ ఉందన్న వార్తల్లో నిజం లేదు’
ఆ వార్తల్లో నిజం లేదు | భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

సింగపూర్ : భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. హిందూస్తాన్ టైమ్స్, ఎన్డీటీవీలు భారతదేశంలో సింగపూర్ కొత్త రకం వేరియంట్ ఉందంటూ తమ కథనాల్లో ఊటంకించాయి.
ఈ వ్యాసాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి కొత్త రకం వేరియంట్ పిల్లల్లో పెను ప్రభావం చూసే అకాశం ఉందని, దేశంలో మూడో వేవ్‌కు కారణం కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వీటిపై సందేహాలను నివృతి చేస్తూ సింగపూర్ వేరియంట్ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది.
సింగపూర్ వేరియెంట్ నిజం కాదు : ప్రశాంత్ రెడ్డి

‘‘నేను, బసిక ప్రశాంత్ రెడ్డి.. సింగపూర్‌లో గత 18 సంవత్సరాలు నివసిస్తున్నాను. ఇక్కడి తెలంగాణ కల్చరర్ సొసైటీ (సింగపూర్) కు ప్రధాన కార్యదర్శి సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం మోనో క్లోనల్ యాంటీబాడీస్‌తో కొవిడ్ -19 చికిత్సను అభివృద్ధి చేస్తున్న ఇక్కడి బయోటెక్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్‌గా సేవలు అందిస్తున్నా. సింగపూర్ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త వేరియంట్‌కు సంబంధించి ఇక్కడ ఎలాంటి జన్యుక్రమాన్ని విశ్లేషించలేదు.
విదేశీ ప్రయాణికుల ద్వారా ఇక్కడ వ్యాపించిన బీ.1.617, ఇతర వేరియెంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులందరికీ ఇంటి నుంచే చదువుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ మాటకొస్తే గతేడాది నుంచి ఇక్కడ పాఠశాలలు తెరిచే ఉన్నాయి.
సింగపూర్‌లో ఉన్న రకాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ గా భావించి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇక్కడి ప్రభుత్వం, అంటువ్యాధుల నిపుణులు సూచించారు. ఇక్కడ ఎలాంటి పూర్తిస్థాయి లాక్ డౌన్ లేదు. ఇండియాలో ఉంటున్న వారు సింగపూర్‌లో ఉంటున్న తమ బంధువుల ఆరోగ్యం గుర్తించి ఎలాంటి ఆందోళన చెందొద్దు’’ అని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

