సువేందును ఎందుకు అరెస్ట్ చేయలేదు?
- ఆయనకు నేనే స్వయంగా డబ్బులిచ్చా
- ‘నారద స్టింగ్’ మాథ్యూ శామ్యూల్ ప్రశ్న

కోల్‌కతా, మే 18: నారద స్కాంలో సుబ్రత ముఖర్జీ, ఫిర్హద్ హకీం తదితర తృణమూల్ నేతలను అరెస్టు చేసిన సీబీఐ.. ఈ కేసులో తృణమూల్ మాజీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్ ప్రశ్నించారు. ‘ఇది సంతోషకరమైన రోజు. స్కాం వెలుగులోకి వచ్చి చాలా ఏండ్లయింది. 2016లో స్టింగ్ ఆపరేషన్ వీడియోలు విడుదలయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలను సీబీఐ టచ్ చేయలేకపోయింది. మూడేండ్ల కిందటే కేసులో చార్జిషీట్ రెడీ అయింది’ అని ఆయన పేర్కొన్నారు.
‘సువేందుకు ఆయన కార్యాలయంలోనే నేను స్వయంగా డబ్బులు ఇచ్చాను. కానీ, సీబీఐ రూపొందించిన నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. ఏమైంది? ఆయన డబ్బు తీసుకున్నట్టు ఫోరెన్సిక్ నివేదికలోనూ నిరూపణ అయింది. నా స్టేట్మెంట్ కూడా సీబీఐ తీసుకున్నది. నా నుంచి డబ్బులు తీసుకున్నట్టు సువేందు అంగీకరించినట్టు నాకు తెలిసింది.’ అని ఆయన తెలిపారు. ఈ కేసులో మాజీ తృణమూల్ నేతలు ముకుల్‌రాయ్, సువేందు పేర్లు కూడా బయటకు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

