కుమ్రంభీం ఆసిఫాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉండటంతో మద్యం, నగదు సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాగా, సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్(Kumrabhim Asifabad) జిల్లా సిర్పూర్(టి) మండంలోని హుడికిలి చెక్ పోస్ట్ వద్ద సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 లక్షల రూపాయల(Rs.5 lakhs) నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సదరు వ్యక్తి డబ్బా గ్రామం నుంచి చంద్రాపూర్‌కు బొలేరో వాహనంలో నగదు తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీల్లో నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధీకొండ రమేష్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎవరైనా నగదు, నగలు తదితర వస్తువులు తీసుకెళ్లేటప్పుడు తమ వెంట సరైన పత్రాలు ఉంచుకోవాలని సూచించారు.