కుమ్రం భీం ఆసిఫాబాద్ : పొలంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని(Ganja) స్వాధీనం చేసుకున్నారు. జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad) జైనూర్ మండలం కొలంగూడకు చెందిన ఆత్రం భీంరావు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
సోదాల్లో మూడు కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామ న్నారు. యువత చెడు అలవాట్లకులోను కావొద్దన్నారు. గంజాయి సమాచారం ఉంటే పోలీసులకు తెలుపాలన్నారు. గంజాయిని సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.