హైదరాబాద్ : ఒడిషా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని(Cannabis )గురువారం రైల్లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్(Konark Express) జనరల్ బోగిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయిని పట్టుబడింది. ఖమ్మం నుంచి ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మహబూబబాద్ వరకు ప్రయాణించి రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలివెలుతున్న 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.