సిద్దిపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని(Ration rice) పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట (Siddipet) జిల్లా చేర్యాల మండలం పెద్దరాజుపేట గ్రామ శివారులో డీసీఎం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చేర్యాల సీఐ శ్రీను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే పెద్దరాజుపేట గ్రామ శివారులో నూనె వెంకట్ అనే వ్యక్తి డీసీఎంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు.
బియ్యం లోడ్ వెళ్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు .ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాల పై పటిష్టమై నిఘా ఏర్పాటు చేశామని, చట్టవ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.