మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో(Heavy rain )జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నాగర్‌కర్నూల్(Nagarkurnool )జిల్లాలో ఓ వ్యక్తి వాగులోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా(Washed away )పోలీసులు కాపాడారు. జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూలు కల్వర్టు దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కల్వర్టు పైనుంచి రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రహదారులపై ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి వాగులో కొట్టుకోవస్తుండడం కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాగు సమీపంలోకి పోలీసు వాహనాన్ని తీసుకువెళ్లి . కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము ఆ వ్యక్తికి కాపాడారు. తాడు వేసి కొట్టుకుపోతున్న వ్యక్తిని తాడు అందించి ఆ తర్వాత సురక్షితంగా బయటికి లాగారు. ప్రవాహం లెక్క చేయకుండా కానిస్టేబుల్స్ సాహసోపేతంగా ఓ వ్యక్తిని కాపాడడం.. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. జిల్లా పోలీసు అధికారులు కానిస్టేబుల్స్‌ను అభినందించారు.
కాగా, ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.