హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో జూన్ 20లోగా నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు పోలీసులు స్పష్టం చేశారు. లేకపోతే నేరస్తుడిగా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఇబ్రహీంబాగ్‌లోని తారమతి బారాదరిలో ఆయన ఇంటికి కోర్టు నోటీసులు అంటించారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు తిరిగిరావడం అనివార్యమైంది.