సిరిసిల్ల రూరల్, మార్చి 11 : అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లో ఏర్పడ్డ టెక్నికల్ సమస్య ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ఉందనుకుని ముందు కు వెళ్లి అందులోపడి మృతిచెందాడు. సోమవారం రాత్రి తన బ్యాచ్‌మేట్, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారాం అపార్ట్మెంట్లోని లిఫ్ట్ సాయం తో మూడో ఫ్లోర్లో లిఫ్ట్ బటన్ నొక్కారు. లిఫ్ట్ వచ్చిందనుకుని ముందు డోర్ ఓపెన్ చేసి కాలువేయడంతో అక్కడి నుంచి ఒకటో ఫ్లోర్‌పై పడిపోయాడు. అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని గంగారాంను సిరిసిల్ల దవాఖానకు తరించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీశ్‌కుమార్, ఇద్దరు కూతుళ్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతితో బెటాలియన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, పోలీసు అధికారులు, సిబ్బంది చేరుకొని నివాళులర్పించారు.
కేటీఆర్ సంతాపం
తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్‌వో, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతిపట్ల బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు.