బేగంపేట, ఫిబ్రవరి 4 : టీపీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవికి మార్కెట్ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం అనే ఫేస్బుక్ పేజీలో సీఎం, మంత్రి, ఎమ్మెల్సీని కించపర్చేలా ఫొటోలను పోస్టు చేశారని ఆదయ్యనగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కే మహేందర్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మల్లు రవిపై ఐపీసీ 469, 504, 505(ఐ)(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు. 8న ఠాణాకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.