రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా, ఇప్పటి వరకు 1.32 లక్షల పోస్టులు భర్తీ అయినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కోర్టు కేసులతోపాటు వేర్వేరు కారణాలతో భర్తీ కాని 18వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ ఏర్పాటుచేసి నియామకాలు చేపడ్తామని చెప్పారు.