శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 20:45:01

మారుతీరావు మృతి కేసులో పోలీసుల దర్యాప్తు

మారుతీరావు మృతి కేసులో పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌ : మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు మృతి కేసులో నగరంలోని సైఫాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మారుతీరావు డ్రైవర్‌ రాజేష్‌ను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా డ్రైవర్‌ పలు వివరాలను వెల్లడించాడు. మారుతీరావు మిర్యాలగూడలో పురుగులమందు దుకాణం వద్ద ఆగినట్లుగా తెలిపాడు. ఆయన తరచూ అదే దుకాణంలో కూర్చునే వాడని చెప్పాడు. హైదరాబాద్‌కు చేరుకుని చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చాక బయట అల్పాహారం తీసుకున్నట్లు వెల్లడించాడు. రాత్రి గదిలో పడుకుంటానని మారుతీరావును కోరినట్లు చెప్పాడు. మారుతీరావు చెప్పడంతోనే నిద్రించేందుకు కిందికి వెళ్లినట్లు డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. 


logo