హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను అ మలు చేయకుండానే చేశామని కేం ద్రం పేర్కొనటాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇంకెతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెప్తుందని బుధవా రం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఉ మ్మడి సమస్యలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలం టూ కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్లల్లో తెలంగాణకు ఎటువంటి తోడ్పాటును అందించకపోయినా సీఎం కేసీఆర్ తన దార్శనికతతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నెం.1కు చేర్చారని కోలేటి దామోదర్ స్పష్టంచేశారు.