34 మందికి పోలీసు పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవాపతకాలకు రాష్ర్టానికి చెందిన 34 మంది ఎంపికయ్యారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మాదాడి రమణకుమార్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవాపతకాలు,
- అదనపు డీజీ విజయ్‌కుమార్, ఎస్పీ రమణకుమార్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు
- 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ సేవాపతకాలు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవాపతకాలకు రాష్ర్టానికి చెందిన 34 మంది ఎంపికయ్యారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మాదాడి రమణకుమార్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవాపతకాలు, మరో 22 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ), 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవాపతకాలు ఇవ్వనున్నారు.
పోలీస్ గ్యాలంటరీ పతకాలు వీరికే..
భాస్కరన్ (ఎస్పీ) శివప్రసాద్ (ఇన్స్పెక్టర్), పురుషోత్తంరెడ్డి (ఇన్స్పెక్టర్), రమేశ్ (ఆర్ఐ), బండారి కుమారి (ఎస్సై), మహేశ్ (ఆర్ఎస్సై), షేక్ నాగుల్ మీరా (ఆర్ఎస్సై), ఆదినారాయణ (హెడ్ కానిస్టేబుల్), అశోక్ (హెడ్ కానిస్టేబుల్)తోపాటు కానిస్టేబుళ్లు సందీప్‌కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కల్యాణ్‌కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేశ్, మహేందర్‌రావు, శివకుమార్ పోలీసు పతకాలకు ఎంపికయ్యారు.
పోలీస్ సేవా పతకాలకు వీరు..
బండి వెంకటేశ్వరరెడ్డి (అదనపు ఎస్పీ), మిశెట్టి రామకృష్ణ ప్రసాద్‌రావు (అదనపు ఎస్పీ), ఆత్మకూరి వెంకటేశ్వరి (అదనపు ఎస్పీ), ఆందోజు సత్యనారాయణ (ఆర్ఎస్సై), కకెర్ల శ్రీనివాస్ (ఆర్ఎస్సై), మహంకాళి మధు (ఆర్ఎస్సై), అజెల్ల శ్రీనివాసరావు (ఆర్ఐ), రసమోని వెంకటయ్య (సీనియర్ కమాండో), అరవేటి భాను ప్రసాద్ రావు (ఇన్స్పెక్టర్), సాయన వెంకటేశ్వర్లు (ఏఎస్సై) పోలీస్ పతకాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.
ఉత్తమ పోలీస్స్టేషన్లు 3
కేసుల దర్యాప్తు, ప్రజలతో సత్సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన పనితీరులో దేశంలోని 17 వేల పోలీస్స్టేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 76 స్టేషన్లలో తెలంగాణ నుంచి మూడు పోలీస్స్టేషన్లు ఎంపికయ్యాయి.
ముగ్గురికి రాష్ట్రపతి పతకాలు
అగ్నిమాపక శాఖ, డిఫెన్స్, హోంగార్డు సేవలకు గుర్తుగా ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్రం అందించే రాష్ట్రపతి పతకాలకు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. ఫైర్ సర్వీస్ మెడల్ (మెరిటోరియస్ సర్వీస్) క్యాటగిరీలో ఒకరికి, హోంగార్డ్ మెడల్ (మెరిటోరియస్ సర్వీస్) క్యాటగిరీలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు దక్కాయి. హోంగార్డులు చీర్ల కృష్ణసాగర్, కే సుందర్‌లాల్, లీడింగ్ ఫైర్‌మెన్ శ్రీనివాస్ మంగళవారం దిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డులు అందుకోనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

