Ponguleti Srinivas Reddy | హైదరాబాద్/సిటీబ్యూరో/మొయినాబా ద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులదిగా భావిస్తున్న రూ.7.5 కోట్ల నగదు శనివారం అజీజ్‌నగర్‌లో పట్టుబడిన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా ద ర్యాప్తు జరుపుతున్నారు. ఆరు కార్లలో నగదు ను తరలిస్తూ చిక్కిన 10 మందికి పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే వారికి సం బంధించిన ఆధారాలు సేకరించిన పోలీసు లు.. వారి ఫోన్ కాల్‌డాటాపై ఆరా తీస్తున్నా రు. నిందితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కం ప్యూటర్లను సీజ్ చేశారు. డబ్బును మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉ న్న శ్రీనిధి ఇంటర్నేషనల్ చైర్మన్ కేటీ మహి ఇంట్లో నుంచి తీసుకొచ్చారని పోలీసులు ని ర్ధారణకు వచ్చారు. ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
ముగిసిన సోదాలు
శ్రీనిధి ఇంటర్నేషనల్ చైర్మన్, ఇంటి యజమాని కేటీ మహి లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి.. నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20 మంది ఐటీ అధికారుల బృందం శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు సోదాలు జరిపింది. కేటీ మహి ఇంటితోపాటు ఆయనకు చెందిన పుట్‌బాల్, క్రికెట్ అకాడమీ, కార్యాలయాల్లో సైతం అధికారులు సోదాలు చేశారు.
ఇంట్లో రూ.12 లక్షల నగదు, కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కొన్ని లాకర్లు ఓపెన్ కాకపోవడంతో ఐటీ అధికారులు వాటిని సీజ్ చేశారు. పట్టుబడిన డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. కేటీ మహి ఇంట్లో నుంచి అక్రమంగా తరలించిన డబ్బులు ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి కోసం వెళ్తున్నాయి, దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులేంటి తదితర వివరాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.