హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘నిరుద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్షం వెళ్తే అరెస్టులు, నిర్బంధాలా? ఆ వార్తలను కవర్ చేయటానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన అని ప్రగల్భా లు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు వేస్తున్న ముళ్లకంచెలు కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై వరుస దాడులను ఆయన ఖండించారు. జర్నలిస్టులపై దాడులను ప్రజాస్వామ్యంపై జరుగుతున్నదాడిగా ఆయన అభివర్ణించారు.