Jubilee Hills By Poll | హైదరాబాద్ : బోరబండలో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యోదని రైతులు పాదయాత్రగా వచ్చారు. అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా ప్రచారం నిర్వహిస్తామని రైతులు వేడుకున్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దండం పెడుతాం.. ప్రచారానికి అనుమతించండి అని కోరినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. కేసులు పెడతామని బెదిరించి, భయపెట్టి బలవంతంగా రైతులను అక్కడ్నుంచి పోలీసులు పంపించేశారు.
బోరబండలో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యోదని పాదయాత్ర చేసిన రైతులు
అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను అడ్డుకున్న పోలీసులు
రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం
రైతులపై కేసులు పెడతామని… https://t.co/MNd8ytkkzc pic.twitter.com/P7Tz23vNF6
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2025