కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. అలాగే రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీసును సీజ్ చేశారు. రైతుబంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకుగానూ అక్రమ కేసులు బనాయించి రేవతిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను.
ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం.
ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo
— KTR (@KTRBRS) March 12, 2025