ఖమ్మం, సెప్టెంబర్ 5: ఖమ్మం నగరం బొక్కలగడ్డ వద్ద అద్దెకున్న వారికీ సాయం అందించాలని కోరిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావును పోలీసులు అదుపు లోకి తీసుకోవడంపై స్థానికులు తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. స్థాని కులకే ఇస్తుండటంతో సిబ్బందికి, నాగేశ్వరరావుకు మాటామాటా పెరిగింది. కాంగ్రెస్ రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
త్రీటౌన్ పోలీసులు వచ్చి నాగేశ్వరరావును తీసుకెళ్లారు. నిరసనగా వందలాది మంది మాటేటి కిరణ్ ఆ ధ్వర్యంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎదు ట ధర్నా చేశారు. పోలీసులతో వా గ్వాదం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, తోట వీరభద్రం సీఐతో మాట్లాడటంతో నాగేశ్వరరావును విడిచిపెట్టడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.