Hyderabad | హైదరాబాద్‌లోని ఓరియన్ విల్లాస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్దకు ఆదివారం మధ్యాహ్నం భారీగా చేరుకున్న పోలీసులు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని అడ్డగించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.
రాజ్ పాకాల నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద, బాల్క సుమన్, రాజుసాగర్, రాకేశ్, ఆశిష్ యాదవ్ సహా 15 మంది అరెస్టు చేశారు.
మాజీ ఎమ్మెల్యే సుమన్ ను కేటీఆర్ ఇంటి వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/7SYgxZDKnR
— Balka Suman (@balkasumantrs) October 27, 2024
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక చివరికి కుటుంబసభ్యులు కలిసి జరుపుకుంటున్న వేడుకను రేవ్ పార్టీగా చిత్రీకరించారని కల్వకుంట్ల సంజయ్‌కుమార్ మండిపడ్డారు. నీచ ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలని విమర్శించారు.
కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు pic.twitter.com/TvnB5QsEiR
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2024
కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.
అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/UUt9EJE7g9
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2024
రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక చివరికి కుటుంబ సభ్యులు కలిసి జరుపుకున్న వేడుకను రేవ్ పార్టీగా చిత్రీకరించి, కొందరు ప్రెస్ వాళ్ళ సహకారంతో నీచ ప్రచారం చేస్తున్న రేవంత్‌కి సిగ్గు ఉండాలి.
– ఎమ్మేల్యే @drsanjayBRS pic.twitter.com/HT2lCgwt6v
— BRS Party (@BRSparty) October 27, 2024