Dharani Bhu Bharati Scam | ధరణీ, భూభారతి కుంభకోణంలో 15 మంది అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం..!
Dharani Bhu Bharati Scam : రాష్ట్రంలో సంచలం సృష్టించిన ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.3.90కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు.
Dharani Bhu Bharati Scam : రాష్ట్రంలో సంచలం సృష్టించిన ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.3.90కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.63.19 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.1లక్ష, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్స్, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ధరణి, భూ భారతీ కుంబకోణంతో సంబంధమున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి వివరాలు వెల్లడించారు. అరెస్టైన వారిలో 1.పసునూరి బసవ రాజు, వయసు: 32 సంవత్సరాలు (యాదాద్రి జిల్లా), 2. జెల్లా పాండ, వయసు: 46 సంవత్సరాలు (యాదాద్రి జిల్లా) 3. మహేశ్వరం గణేష్ కుమార్, వయసు: 39 సంవత్సరాలు (యాదాద్రి జిల్లా) 4. గాజులపాటి శ్రీనాథ్, వయసు: 35 సంవత్సరాలు (జనగామ), 5. యెనగంధుల వెంకటేష్, (జనగామ), 6. కోదురి శ్రావణ్ వయసు: 35 సంవత్సరాలు (జనగామ), 7. కొలిపాక సతీష్ కుమార్ వయసు: 36 సంవత్సరాలు, కొడకండ్ల (ఎం), జనగామ. 8. తడూరి రంజిత్ కుమార్ వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ. 9. దుంపల కిషన్ రెడ్డి, వయసు: 29 సంవత్సరాలు, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా, 10. దశరథ మేఘావత్ వయసు: 28 సంవత్సరాలుతురుపల్లి. 11. నారా భాను ప్రసాద్, వయసు: 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట, 12. గొపగాను శ్రీనాథ్, వయసు: 32 సంవత్సరాలు, శివ కుమార్, వయస్సు 33, అమంగల్, నల్లగొండ. 13. ఒగ్గు కర్నాకర్, వయసు: 42 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 14. కమల్ల 15. అలేటి నాగరాజు, వయస్సు 32, (యాదాద్రి జిల్లా)కు చెందిన వారు ఉన్నారని పోలీసులు గుర్తించారు.
భారీ కుంభకోణానికి పాల్పడిన నిందితులు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో అన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను అన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకోని చెల్లించాల్సన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా ద్వారా పే చేస్తానని నమ్మించి.. రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించేవాడు. అలా వసూలు చేసిన డబ్బును అన్లైన్ సర్వీస్ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఈ చలాన్లను ప్రధాన నిందితుడికి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్పెక్ట్ ” ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ల రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి ఛలాన్‌ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.
ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్‌ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసేవారు. అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి.. నకిలీ చలాన్లను స్థానిక యం.ఆర్.ఓ/ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొదుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మధ్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను మిగితా వారికి 10 శాతం నుండి 30 శాతం వరకు కమీషన్ చెల్లించేవారు. ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు రిజిష్టర్ అయ్యాయ’ని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకమైన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరీ చేతన్. జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

