హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో తన సొంతూరు ఖమ్మంలో ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి నరసరావుపేటకు తరలించారు.
కాగా, సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. విధ్వంస ఘటనకు 12 మంది ప్రధానకారణమని భావిస్తున్నారు. ప్రైవేట్ అకాడమీలు ఆర్మీ ఉద్యోగార్థులను రెచ్చగొట్లు పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఇందులో పాల్గొన్నట్లు గుర్తించారు.