హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న కేసులో వర్మ విచారణ ఎదురొంటున్నారు. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వర్మకు మళ్లీ నోటీసులు ఇచ్చారు.