హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. నిరుడు పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతినగా రూ.1500 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
తాజాగా మంగళవారం కాకినాడ జిల్లా తుని వద్ద కుమ్మరిలోవ సమీపంలో పోలవరం కాలువ ఆక్విడెక్ట్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తుండగా బేస్మెంట్ ఊచలు కార్మికులపై జారి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.