హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోతున్న ది. బాగా తెలిసినవారు, కొన్నిసార్లు కుటుంబసభ్యు లే కామాంధులుగా మారి బాలికలను లైంగిక వేధిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కు మారుడి పోక్సో కేసులోనూ నిందితుడు భగీరథ్ సదరు బాధితురాలిని స్నేహం ముసుగులోనే మాయ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నమోదై ఐదు రోజులవుతున్నా పోలీసులు ఇంకా అతడిని అ రెస్టు చేయకపోవడంతో సామాన్యులకు న్యాయం దొ రుకదనే అభిప్రాయం కలుగుతున్నది. తెలంగాణ ఏ ర్పడిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం రెండున్నరేండ్ల క్రితం ప్రభుత్వం మారాక బాలికలపై జరిగే బలాత్కారాల్లో మొదటి పది రాష్ర్టాల జాబితాలో చేరింది. జాతీయ నేర గ ణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) వెల్లడించిన క్రైమ్ ఇన్ ఇండియా-2024 నివేదిక ప్రకారం.. 2024లో నమోదైన పోక్సో కేసుల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది.
ఆ ఏడాది పోక్సో కేసులు 2,934 నమో దు కాగా.. వాటిలో రేప్ కేసులే(సెక్షన్ 4,6) 2,101 ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో రోజుకు సగటున ఆరుగురు ఆడబిడ్డలు బలాత్కారానికి గురవుతున్నా రు. 2023తో పోల్చితే.. 2024లో పోక్సో కేసుల న మోదులో సుమారు 18.08% పెరుగుదల నమోదైంది. ఇక మహిళల పట్ల నేరాల్లోనూ, మానవ అ క్రమ రవాణా, ఆర్థికపరమైన మోసాలు, సైబర్ క్రై మ్స్లోనూ తెలంగాణ ఏకంగా మొదటి స్థానంలో ఉండటం కలవరపెట్టే అంశం. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన నేరాల రేటు పెరుగుతూనే ఉంది. ప్రతి లక్ష మంది జనాభాకు నమోదైన కేసుల సంఖ్యతో న మోదైన నేరాల శాతాన్ని పోల్చితే.. అన్ని నేర విభాగాల్లోనూ తెలంగాణ పోటీపడుతుంటడం సిగ్గుపడాల్సిన అంశం. దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే, సుమారు 96.6% కేసుల్లో నిందితులు బాధితులకు ముందే పరిచయం ఉన్నవారు కావడం గమనార్హం. 2024లో నమోదైన మొత్తం 44,126 చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో, ఏకంగా 42,634 కేసులు సన్నిహితులు లేదా పరిచయస్తుల ద్వారా జరిగినవేనని ఆ నివేదిక పేరొన్నది.
దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసుల్లో సుమారు 3,658 కేసుల్లో నిందితులు నేరుగా కుటుంబసభ్యు లే కావడం గమనార్హం. అందులో కన్నతండ్రి, అన్నదమ్ములు, మేనమామలు, తాతలు వంటి వారు ఉ న్నారు. పొరుగువారు, కుటుంబ స్నేహితులు, బంధువులు, యజమానులు సుమారు 16,668 కే సుల్లో నిందితులుగా ఉన్నారు. తెలియని వ్యక్తులు, అపరిచితుల కేవలం 3.4% అంటే 1,492 కేసుల్లో వారి ప్రమేయం ఉంది. అత్యధికంగా పోక్సో కేసులు నమోదైన రాష్ర్టాల్లో తమిళనాడు(5,320), మహారాష్ట్ర(4,829), మధ్యప్రదేశ్(3,721) తెలంగాణ (2,934) ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో కేసుల సంఖ్య 6%పెరిగి 69వేలు దాటింది. చైతన్యం పెరుగడం, ఎఫ్ఐఆర్ తప్పనిసరి చేయడం వల్లే ఈ సంఖ్య పెరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు.