భువనగిరి అర్బన్, అక్టోబర్ 21: బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. వలిగొండ పరిధిలోని శాంతి నిలయంలో చదువుతున్న బాలిక దసరా సెలవుల్లో భువనగిరి బాలసదన్‌కు 1న వచ్చింది.14న బాలసదన్‌లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించగా డీసీపీవోతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. ఆ సమయంలో ఓ బాలిక బాత్రూమ్కు వెళ్లి గదిలోకి వస్తుండగా అటెండర్ వెంకట్‌రెడ్డి లైంగికంగా వేధించగా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్లింది. గమనించిన బాల సదన్ సిబ్బం ది ఆరా తీయగా తనపై గాయాలను చూపించింది. సోమవారం జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ జైపాల్, డిపూ ్యటీ చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిలర్ శంకర్, సీనియర్ అసిస్టెంట్ నర్సింహారావు విచారణ జరుపగా వెంకట్‌రెడ్డి బాలికను గాయపరిచినట్టు తేలింది. భువనగిరికి చెందిన వెంకట్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ తెలిపారు. మరోవైపు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన సిరిసిల్ల పట్టణం గీతానగర్ ప్రభుత్వ ఉన్న త పాఠశాల ఉపాధ్యాయుడు నరేందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు.