హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 ( నమస్తే తెలంగాణ ): పీఎం యశస్వికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. స్కాలర్షిప్ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కోరారు. ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు రూ.1.25 లక్షలు ఇవ్వనున్నుట్టు పేర్కొన్నారు. 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పట్టణంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1.50లక్షలకు మించరాదని వెల్లడించారు.
వరంగల్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కాళోజీ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేండ్ల బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి టీజీ-ఈఏపీసెట్-2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్ వారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఈ నెల 14 వరకు https://tsparamed.tsche.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక ఫైనల్ మెరిట్ స్థానం సిద్ధం చేయనున్నట్టు వివరించారు.