నిగ్గదీసి అడుగుతున్నది మా తెలంగాణం
తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతున్నది. మోదీ పరివారం జవాబేమిటి?
రేపట్నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. రెండు రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఉంటున్నారు. మూడో తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటానికీ సిద్ధమవుతున్నారు. అంతకుముందు తెలంగాణ సమాజం ప్రధానిని నిగ్గదీసి అడుగుతున్న ప్రశ్నలకు మోదీ ఏం జవాబు చెప్తారు?