హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశ పురోగతికి తెలంగాణ అవిరళ కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘జనసేనకు జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.