హైదరాబాద్ : ముచ్చింతల్, ఇక్రిశాట్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. మోదీకి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్వాగతం పలికారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్రిశాట్‌కు బయల్దేరారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవంలో మోదీ పాల్గొని కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి 10 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. 7 నిమిషాల పాటు పంటలను పరిశీలించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఇక్రిశాట్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.