శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 21:05:29

ఔషధ కంపెనీలు ఆవిష్కరణలతో ముందుకు రావాలి: మోదీ

ఔషధ కంపెనీలు ఆవిష్కరణలతో ముందుకు రావాలి: మోదీ

ఢిల్లీ: ఔషధ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఔషధ కంపెనీ ప్రతినిధులకు ప్రధాని పలు సూచనలు చేశారు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎన్‌ఏ టెస్టింగ్‌ కిట్లు యుద్ధప్రాతిపదికన తయారు చేయాలని కోరారు. అవసరమైన ఔషధాల సరఫరా పెంచేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ దశలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలక పాత్ర పోషించాలి.   

ఏపీఐల తయారీ, క్లిష్టమైన ఔషదాలు, వైద్య పరికరాల ఉత్పత్తి నిర్ధారణకు నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. రూ.10వేల కోట్లు, రూ.4 వేల కోట్లతో రెండు పథకాలు రూపొందించాం. ఔషధాల విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫార్మసీలలో కూడా సామాజిక దూరం పాటించేలా చూడాలి. ఔషదాలు హోమ్‌ డెలివరీ ఇచ్చేందుకు మార్గాలు అన్వేషించాలి. వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. కొత్త టీకాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 


logo