e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home News ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు

ఆస్ట్రేలియాలో వరదలు.. 100 ఏండ్ల రికార్డు బద్దలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 100 ఏండ్ల క్రితం నాటి రికార్డులు బద్దలయ్యాయి. సోమవారం సిడ్నీకి పశ్చిమాన వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు యోచిస్తున్నారు. రాబోయే కొద్ది రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. 60 సంవత్సరాల అనంతరం వరదలు సిడ్నిలో విపత్కర పరిస్థితులను సృష్టించాయి.


గత మూడు రోజులుగా ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వరద పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. రోడ్లు చెరువులుగా మారాయి.

- Advertisement -

వరద నీరు డజన్ల కొద్దీ పట్టణాలకు చేరుకున్నది. ప్రజలను ఇక్కడి నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వేలాది మంది ఇళ్లు వదిలి సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 100 సంవత్సరాలలో మొదటిసారి ఇలాంటి విపత్తు వచ్చిందని అధికారులు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని స్థానిక అధికారులను కోరారు.

ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇళ్ళు దెబ్బతిన్నాయని అధికారులు చెప్తున్నారు. అనేక ప్రధాన రహదారులు మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 2019 చివరి నుంచి 2020 ఆరంభం వరకు అడవుల అగ్నిప్రమాదం తరువాత ఈ వరద సంఘటన కనిపించింది. ఆదివారం సిడ్నీ శివారు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. దాదాపు 111 మి.మీ (4.4 అంగుళాలు) వర్షంతో.. గత ఆరు రోజుల్లో కొన్ని ఉత్తర తీర ప్రాంతాలలో దాదాపు 900 మి.మీ (35 అంగుళాలు) కురిసింది. మార్చి సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ వర్షాలు పడినట్లు ప్రభుత్వ డాటా పేర్కొన్నది.


వాయవ్య సిడ్నీలోని హాక్స్బరీ, నేపాన్ నదులకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఎన్నో ఇళ్లు నీట మునిగిపోవడంతో నివాసితులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 18 వేల మందిని అధికారులు సహాయ శిబిరాలకు తరలించారు. న్యూ సౌత్ వేల్స్ లోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న క్వీన్స్‌లాండ్‌కు తీవ్రమైన వరద హెచ్చరిక జారీ చేశారు.

ఇవి కూడా చదవండి..

భక్తులకు శుభవార్త : రెండేండ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర

ఆస్కార్ నామినేషన్స్‌.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో ‘ది వైట్ టైగర్’

చైనా వ్యాక్సిన్‌ను తిరస్కరిస్తున్న తైవాన్‌ ప్రజలు.. ఎందుకంటే..?

బెంగాల్‌, అసోం ఎన్నికల బరిలో జేడీయూ

109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్‌.. చరిత్రలో ఈరోజు


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement