చైనా వ్యాక్సిన్ను తిరస్కరిస్తున్న తైవాన్ ప్రజలు.. ఎందుకంటే..?
చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించారని తెలిపింది.

తైపీ : చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించారని తెలిపింది. ఇది చైనాకు ఇబ్బందికరంగా తయారైనట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తైపీకి చెందిన హోవార్డ్ ప్లాజా హోటల్లో ఫోకస్ సర్వే రీసెర్చ్ ఈ నివేదికను సమర్పించినట్లు తైవాన్ టైమ్స్ తెలిపింది. టీకాను ఆమోదించని వారిలో 67 శాతం మందిలో 27.1 శాతం మంది తాము ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నామని, 39.9 శాతం మంది తాము చాలా అసంతృప్తిగా ఉన్నామని తెలిపినట్లు నివేదిక పేర్కొన్నది.
చైనా తన వ్యాక్సిన్ల గురించి శాస్త్రీయ డాటాను విడుదల చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని స్ట్రాటజిక్ స్టడీ సొసైటీకి నాయకత్వం వహిస్తున్న తమంగ్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ వాంగ్ కున్-యి అభిప్రాయపడ్డారు. చైనా నుంచి తైవాన్ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలనుకుంటే దీనికి 18.9 శాతం మందికి మాత్రమే అనుమతి ఉన్నదని ఆయన చెప్పారు.
తైవాన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ స్టడీ సొసైటీ, తైవాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ రూపొందించిన ఈ సర్వే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో తైవాన్-చైనా సంబంధాలు, తైవాన్-యుఎస్ సంబంధాల గురించి ప్రజలను ప్రశ్నలు అడిగారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్, అసోం ఎన్నికల బరిలో జేడీయూ
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

