హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో రూ.600 కోట్ల స్కామ్‌కు తెరలేపిందని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన పలు ఆధారాలతో ఓ వీడియో విడుదల చేశారు. వాహనాల ఫిట్నెస్ను పరీక్షించేందుకు 37 కేంద్రాల కోసం నిరుడు ఫిబ్రవరిలో మొదటిసారి టెండర్లు పిలిచారని తెలిపారు. ఒక్కో కేంద్రం ఏర్పాటు కు రూ.8 కోట్ల వ్యయంగా పేర్కొన్నారని చెప్పారు. వాటికి మంజూరీ కూడా ఇచ్చి, కొద్దిరోజులకే రద్దు చేశారని పే ర్కొన్నారు. మళ్లీ అదే ఏడాది జూలైలో మరోసారి టెండర్లు పిలిచి తర్వాత మళ్లీ రద్దుచేశారని చెప్పారు. తాజాగా ఈ నెల 2న మళ్లీ టెండర్లు పిలిచారని, కానీ భారీ మార్చారని తెలిపారు. రెండుసార్లు కూడా 37 కేంద్రాలకు ఒకేసారి బిడ్డింగ్‌లు ఆహ్వానించారని, తాజాగా రెండు క్లస్టర్లుగా విభజించారని తెలిపారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని రూ.8 కోట్ల నుంచి రూ.11.50 కోట్లకు పెంచారని తెలిపారు. దీంతో 37 కేంద్రాల ఖర్చు రూ.425 కోట్లకు పెరిగిందని వివరించారు. మొత్తం రూ.490 కోట్లు అవుతుందని, దీనికి రూ.425 కోట్ల వ్య యం కూడా కలిపితే 900 కోట్లు అవుతుందని వివరించారు.
ఈ నెల 17న టెండర్ గడువు ముగియనుండగా.. అనూహ్యంగా గురువా రం నిబంధనల్లో మార్పులు చేశారని సతీశ్‌రెడ్డి తెలిపారు. 8 కేంద్రాలున్న క్లస్టర్‌కు టెండర్ వేసేవారి నెట్‌వర్త్‌ను రూ.50 కోట్ల నుంచి రూ.10 కోట్లకు తగ్గించేశారని, అలాగని.. టెండర్ గ డువు మాత్రం పెంచలేదని తెలిపారు. నిరుడు ఎనిమిది కేంద్రాలతో కూడిన క్లస్టర్‌కు టెండర్ వేసే వారు రూ.50కోట్ల నికర విలువ ఉండాలని నిబంధన విధించారని తెలిపారు. కానీ ఏడు కేంద్రాలతో ఏర్పడిన క్లస్టర్‌కు టెండర్వేసే వారి నెట్‌వర్త్ రూ.9 కోట్లు ఉండే సరిపోతుందని నిబంధన విధించారని పేర్కొన్నారు. వ్యవహారం వెనుక ఓ మంత్రి అన్న కొడుకు ఉన్నాడని తెలుస్తున్నదని సతీశ్‌రెడ్డి ఆరోపించారు.