హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ నియామకంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇ చ్చింది. వర్సిటీ వీసీగా డాక్టర్ ఘంటా చక్రపాణి నియామకంపై కౌంటర్లు దా ఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూజీసీతోపాటు వీ సీ చక్రపాణిలను ఆదేశించింది. వీసీగా చక్రపాణికి అర్హతలు లేవని, జీవో 229 ను రద్దు చేయాలని కోరుతూ హనుమకొండకు చెందిన అసోసియేట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బీ కుమారస్వామి వేసిన కోవారెంటో పిటిషన్‌ను గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా చక్రపాణి నియామకం జరిగిందని చెప్పారు. ఆయనకు వయో పరిమితి కూడా దాటిపోయిందని తెలిపా రు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.