హెచ్‌వోడీల నియామకాల్లో సర్కారు అలసత్వం!
రాష్ట్ర వైద్యశాఖలో కాంగ్రెస్ మార్క్ ముందస్తు ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఓ వైపు విభాగాధిపతులు వరుసగా ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్తవారిని నియమించడంలో జాప్యం కారణంగా పాలన అ స్తవ్యస్తంగా మారుతున్నదనే చర్చ నడుస్తున్నది.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యశాఖలో కాంగ్రెస్ మార్క్ ముందస్తు ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఓ వైపు విభాగాధిపతులు వరుసగా ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్తవారిని నియమించడంలో జాప్యం కారణంగా పాలన అ స్తవ్యస్తంగా మారుతున్నదనే చర్చ నడుస్తున్నది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ అజయ్‌కుమార్ ఉద్యోగ విరమణ పొందారు. రెండు వారాలు కా వస్తున్నా.. సర్కార్ ఇప్పటివరకు టీవీవీపీకి కొత్త కమిషనర్‌ను నియమించలేదు.
ఇటీవల ప్రభుత్వం టీవీవీపీని రద్దు చేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్(డీఎస్హెచ్సీ)గా మార్చింది. దీని విధి విధానాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. డీఎస్హెచ్సీకి పూర్తిస్థాయి డైరెక్టర్ నియామకానికి ఇంకా సమయం పట్టనుండగా.. టీవీవీపీ కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. జూన్ 30న అకడమిక్ డీ ఎంఈ శివరాం ప్రసాద్, జూలై 31న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎం ఈ) పదవీ విరమణ పొందనున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 26 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

